కంభం మండలంలో పొలంబడి కార్యక్రమం

4చూసినవారు
కంభం మండలంలో పొలంబడి కార్యక్రమం
ప్రకాశం జిల్లా కంభం జంగం గుంట్ల గ్రామాలలో బుధవారం శనగ పంటలో విత్తన శుద్ధి, ఎరువుల యాజమాన్యంపై పొలంబడి కార్యక్రమం జరిగింది. మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్ ముహమ్మద్ రైతులకు శనగ విత్తనాలకు ట్రైకోడెర్మా విరిడితో శుద్ధి చేయడం వల్ల తెగుళ్లను అరికట్టవచ్చని, అలాగే పంటకు అవసరమైన ఎరువుల యాజమాన్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వి.హెచ్.ఏ లక్ష్మి, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :