మంతా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అన్నంపల్లి, గుడిమెట్ట చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. ఈ నీటితో మండలంలోని కుంటలు, చెక్ డ్యామ్ లు, పలు గ్రామాల్లోని చెరువులకు నీళ్లు చేరడంతో రైతులు పంటలు పండించేందుకు అనువుగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.