కంభం చెరువుకు భారీగా తరలివస్తున్న వరద నీరు

3చూసినవారు
ప్రకాశం జిల్లాలోని కంభం చెరువుకు భారీగా వరద నీరు చేరుతోంది. శనివారం కూడా వరద ఉధృతి కొనసాగింది. స్థానిక అధికారులు అంచనా ప్రకారం, చెరువుకు మరో పది రోజులపాటు వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా అలుగు పారుతోందని స్థానికులు తెలిపారు. ప్రజలు అలుగు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్