మార్కాపురం జిల్లా కంభం మండలం తురిమెళ్ళ గ్రామ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఓ కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. కారులో ఉన్న ఎయిర్‌బ్యాగ్‌లు సకాలంలో తెరుచుకోవడంతో వారికి ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.