గిద్దలూరు: బండలాగుడు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

70చూసినవారు
గిద్దలూరు: బండలాగుడు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే
గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించారు. ముందుగా ఆలయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుని అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్