కంభం రైల్వే స్టేషన్ నుండి రైలులో గుంటూరుకు ప్రయాణించిన ఓ వృద్ధుడు బుధవారం బ్రాడీపేట సమీపంలో రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. అక్కడి రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా మృతుడి జోబిలో కంభం నుంచి గుంటూరుకు రైలులో ప్రయాణించినట్లుగా రైలు టికెట్టు ఉన్న విషయాన్ని గుర్తించారు. ఎవరన్నా ఈ వృద్ధుడిని గుర్తిస్తే అతని వివరాలు 9430790522 నంబర్ ద్వారా సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.