గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు, నారా లోకేష్ గారి నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ఆయన కార్యకర్తే అధినేత సిద్ధాంతానికి ప్రతిరూపమని తెలిపారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో శ్రమించే ప్రతి కార్యకర్తను నాయకుడిగా గౌరవిస్తూ, వారిలో ఆత్మవిశ్వాసం నింపడమే లోకేష్ గారి శైలి అని ఆయన పేర్కొన్నారు. పదవుల కంటే ప్రజా సేవకే ప్రాధాన్యతనిస్తూ, కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నారని, యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన అంకితభావం అసామాన్యమని అశోక్ రెడ్డి గారు తెలిపారు. కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న లోకేష్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీకి బలం అని, సామాన్య కార్యకర్తను కూడా అధినేతగా మార్చగల సత్తా ఉన్న నాయకుడు అని ఆయన అన్నారు.