కంభం: నిత్యం బోధనా కార్యక్రమాలతో బిజీగా ఉండే ఉపాధ్యాయులకు ఆటవిడుపుగా మండల స్థాయి క్రీడా పోటీలు ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయుల ఆరోగ్య, ఆనందాలకు ఇవి దోహదపడతాయని ఎంఈఓ-1 అబ్దుల్ సత్తార్ అన్నారు. ఆరోగ్య అవగాహన, టీమ్ స్పిరిట్ పెంపుదల లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈ పోటీలు మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నాలుగు దశల్లో జరుగుతాయి. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.