సెంచరీ కొట్టిన మార్కాపురం యువకుడు

4చూసినవారు
సెంచరీ కొట్టిన మార్కాపురం యువకుడు
మార్కాపురం జిల్లా కంభం జూనియర్ కాలేజీలో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో మార్కాపురం ఆటగాడు అవినాష్ 58 బంతుల్లో 104 పరుగులు సాధించి అదరగొట్టాడు. మార్కాపురం సబ్ సెంటర్, ఒంగోలు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన మార్కాపురం జట్టు 16 ఓవర్లకు 144 పరుగులు చేసింది. ప్రత్యర్థి రెవెన్యూ టీమ్ 125 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో మార్కాపురం జట్టు ఘన విజయం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్