మార్కాపురం జిల్లా కొమరోలు పట్టణంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు శుక్రవారం స్థానిక ఎస్సై నాగరాజు మిర్రర్లు ఏర్పాటు చేశారు. ఇటీవల ఈ ప్రాంతంలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మూల మలుపుల వద్ద ఈ మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనదారులు వీటిని సద్వినియోగం చేసుకొని ప్రమాదాల నివారణకు సహకరించాలని ఆయన కోరారు.