గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మంగళవారం అమరావతిలో పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మానవ నిర్మిత చెరువు అయిన కంభం చెరువును పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించాలని ఆయన మంత్రిని కోరారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన మంత్రి రోజా, కంభం చెరువును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.