ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకుంటపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన 'మీ భూమి మీ హక్కు' కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసి, ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా, మాజీ సీఎం జగన్ సరిహద్దు రాళ్లపై కూడా తన బొమ్మలు వేసుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.