మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ జరిగింది. ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించగా, కొన్నింటిని తక్షణమే పరిష్కరించారు. మరికొన్నింటిని త్వరలో పరిశీలిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.