కొమరోలు జట్టుపై నంద్యాల జట్టు విజయం

18చూసినవారు
కొమరోలు జట్టుపై నంద్యాల జట్టు విజయం
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీలో కొమరోలు జట్టుపై నంద్యాల జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కొమరోలు జట్టు 18 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌట్ అయింది. నంద్యాల జట్టు కేవలం 7.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. నంద్యాల జట్టు తరఫున ప్రవీణ్ 25 బంతుల్లో 51 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. సుదర్శన్ రెడ్డి 3 ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్