ఈ నెల 13వ తేదీ నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుంతకల్లు, మార్కాపురం రోడ్డు మార్గాల మధ్య డైలీ ప్యాసింజర్ రైలు నడపడానికి సిద్ధమయ్యారు. 57407/57408 నంబర్ తో నడిచే ఈ రైలు గుంతకల్లు, మద్దికేర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబట్ల కృష్ణాపురం, కంభ, తర్లుపాడు రైల్వే స్టేషన్లలో ఆగుతూ మార్కాపురం రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. ప్రతిరోజు గుంతకల్లులో సాయంత్రం 5:30కి బయలుదేరి రాత్రి 11:30కి మార్కాపురం చేరుకుంటుంది. మార్కాపురం రోడ్డు నుంచి ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 నిమిషాలకు బయలుదేరి ఉదయం 10:30కి గుంతకల్లు చేరుతుంది.