ప్రకాశం జిల్లా కంభం మండలం చిన్న కంభం గ్రామంలో మంగళవారం వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో నిర్మిస్తున్న పది మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని, దీనివల్ల పేదలు నష్టపోతారని నాగార్జున రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే సేకరించిన సంతకాలతో గవర్నర్‌ను కలిసి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.