కంభం మండలం జంగంగుంట్ల గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోరుమామిళ్ల నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అర్ధవీడు మండలం కాకర్లకు చెందిన శ్రీనివాసరెడ్డి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న తర్వాత అదుపుతప్పి పాత పంచాయతీ కార్యాలయాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.