మంగళవారం మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం చిన్న కంభం గ్రామ సమీపంలో అడ్డరోడ్డు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కంభం మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన పూసలపాటి బాలంకయ్య తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.