రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

5చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్ లో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం, లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న కంభం పట్టణానికి చెందిన దిలీప్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్