
ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం.. పోలీసుల విచారణ
ఏలూరు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహంలో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ ర్యాగింగ్‌తో విసిగిపోయిన విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, సోమవారం అర్ధరాత్రి పోలీసులు వసతి గృహానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీనియర్లు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం.




