లింగోజిపల్లి గ్రామంలో పెన్షన్లు పంపిణీ

8చూసినవారు
ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లను ఆయన అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు పెంచిన పెన్షన్లు ప్రతినెల 1వ తేదీ కల్లా ఇంటి వద్దకే తీసుకువచ్చి లబ్ధిదారులకు అందిస్తున్నారని, దీనిని గ్రహించి కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :