గిద్దలూరు మున్సిపాలిటీలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కుక్కల దాడుల్లో ఇప్పటికే పలువురు గాయపడినట్లు సమాచారం. పట్టణంలోని వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కల వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ సమస్యను అరికట్టడానికి అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.