కొమరోలు మండలంలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మండల విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు. కొమరోలు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, చింతలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.