ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో మంగళవారం మద్యం తాగి వాహనాలు నడిపిన పలువురికి గిద్దలూరు కోర్టు న్యాయమూర్తి భరత్ చంద్ర జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించారు. మద్యం తాగి ఆటో నడిపిన డ్రైవర్‌కు 24 రోజుల జైలు శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధించారు. అలాగే, మద్యం తాగి ద్విచక్ర వాహనాలు నడిపిన ఏడుగురికి ఒక్కొక్కరికి రూ. 10,000 జరిమానా, నలుగురికి 23 రోజులు, ఒకరికి 24, మరొకరికి 26, ఇంకొకరికి 22 రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ తీర్పు మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి హెచ్చరికగా నిలుస్తుంది.