ప్రకాశం జిల్లా కంభం నుండి బొమ్మిలింగం వెళ్తున్న ఆర్టీసీ బస్సు కాకర్ల చెరువు కట్ట రోడ్డు పక్కన ప్రమాదానికి గురైంది. రోడ్డు చివరన భూమిలోకి బస్సు వెనుక టైరు దిగిపోయింది. దారిలో పశువులను తప్పించబోయి ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.