
బిగ్ బాస్ నుంచి దివ్వెల మాధురి ఎలిమినేట్!
తెలుగు బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అడుగుపెట్టి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దివ్వెల మాధురి ఈ వారం ఎలిమినేట్ అయినట్లు సమాచారం. టాప్ ఓటింగ్‌లో తనూజ, కళ్యాణ్‌లు ముందంజలో ఉండగా, తక్కువ ఓట్లు పొందిన మాధురి బయటికెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌తో హౌస్‌లోకి వచ్చిన మాధురి తరచూ వివాదాల్లో నిలిచినా, ఇటీవల తన ఆట తీరులో మార్పు చూపింది. ఈ టైంలో ఆమె ఎలిమినేషన్ వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.




