ప్రకాశం జిల్లా అర్ధవీడులో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఎస్ఐ నాంచారయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాంచారయ్య సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు సర్దార్ పటేల్ సేవలను గుర్తుచేస్తూ, ఆయన అడుగుజాడల్లో నడిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రతిజ్ఞ చేయించారు.