ప్రకాశం జిల్లా కంభం మండలంలోని సూరేపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయ హుండీని పగలగొట్టి సుమారు రూ. 10 వేల నగదును అపహరించినట్లు ఆలయ అర్చకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.