కడప జిల్లా గురుగుంపు తాండాకు చెందిన ఇద్దరు స్నేహితులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. గత నెల 11వ తేదీన కొమరోలు మండలం గోనపల్లె గ్రామం వద్ద బొప్పాయి కాయలు అమ్ముకుంటున్న మహిళ మెడలోంచి 3 తులాల బంగారు ఆభరణాన్ని ద్విచక్రవాహనంపై వచ్చి లాక్కుని వెళ్లారు. ఈ కేసులో కొమరోలు ఎస్సై నాగరాజు మంగళవారం ఇరువురిని అరెస్ట్ చేశారు.