న్యాయమూర్తులపైనే బెదిరింపు లేఖలు..?

7చూసినవారు
న్యాయమూర్తులపైనే బెదిరింపు లేఖలు..?
ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సబ్ జైల్‌ను గురువారం జిల్లా సీనియర్ సివిల్ జడ్జి ఎస్. కె. ఇబ్రహీం షరీఫ్, గిద్దలూరు న్యాయమూర్తులు కె. భరత్ చంద్ర, ఏ. ఓంకార్ సందర్శించారు. ఖైదీల బాగోగులు, జైలు సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక న్యాయమూర్తులపై బెదిరింపు లేఖలు రాసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిమాండ్ ఖైదీ, కోర్టు ఉద్యోగి స్టెనోగ్రాఫర్ దండూరి మల్లికార్జునరావును కూడా న్యాయమూర్తులు పరామర్శించి, చట్టపరమైన సహాయం అందేలా జైలర్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్, లీగల్ ఎయిడ్ న్యాయవాది, పారా లీగల్ వాలంటీర్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్