జాత్లాపురంలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం

10చూసినవారు
జాత్లాపురంలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యం
పొదిలి మండలంలోని జాత్లాపురం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. గురువారం సాయంత్రం తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన వారు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం వారి కుటుంబ సభ్యులు పొదిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి సీఐ రాజేష్ కుమార్ నేతృత్వంలో గాలింపు చర్యలు ప్రారంభించారు. విద్యార్థుల కోసం వివిధ ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్