గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మే 30వ తేదీ శనివారం గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేను కలిసి అర్జీలు సమర్పించవచ్చని, వచ్చిన అర్జీలన్నింటినీ పరిశీలించి పరిష్కరిస్తారని కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజల సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.