ప్రకాశం జిల్లా గిద్దలూరులోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజన నిర్వాహకులకు, సహాయకులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం జరిగింది.
టాటా ట్రస్టు సహకారంతో విజయవాహిని చారిటబుల్ ట్రస్టు ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, పత్తి.శ్రీనివాసులు హాజరై, వంట నిర్వాహకులకు ఆహార నాణ్యత, పరిశుభ్రతలపై సూచనలు ఇచ్చారు. ఎండిఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎస్.రాజ లీలావతి ఆహార బలవర్ధకత, నాణ్యతా ప్రమాణాలను వివరించారు. +ఎఫ్ గుర్తు ఉన్న ఉప్పు, నూనె, నిత్యావసరాలనే వాడాలని సూచించారు.