జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, కంభం సర్కిల్ పరిధిలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై మంగళవారం మూడు బృందాలుగా ఏర్పడి వాహన తనిఖీలు నిర్వహించినట్లు సర్కిల్ సీఐ మల్లికార్జున తెలిపారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు చేపట్టారు. వాహన సంబంధిత ధ్రువపత్రాలను తనిఖీ చేయడంతో పాటు, డ్రైవర్లకు సూచనలు కూడా అందించారు.