మార్కాపురం జిల్లా గిద్దలూరులో డీఈవో సుబ్బారావు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం విద్యార్థుల నమోదు లక్ష్యంగా కృషి చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.