నిలువు నీడ కోల్పోయిన యానాది కుటుంబాలు

1చూసినవారు
మంగళవారం కురిసిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం పిట్టికాయగుళ్ల గ్రామంలోని ఆరు యానాది కుటుంబాల పూరి గుడిసెలను కూల్చివేసింది. దీంతో నిలువ నీడతో పాటు, ఇంట్లోని బియ్యం, నిత్యవసర సరుకులు కూడా వానలో తడిచిపోయాయి. తమ పిల్లలకు కడుపునిండా ఆహారం పెట్టలేని దుస్థితి ఏర్పడిందని యానాది కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తమను పట్టించుకోవడం లేదని, దాతలు ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్