మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వైయస్సార్ సెంటర్ లో గురువారం వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వైయస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.