మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో వై.ఎస్. జగన్ పుట్టినరోజు వేడుకలను ఏపీ వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హోటల్లో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి వై.ఎస్. జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వై.ఎస్. జగన్ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు.