బాపట్ల, పర్చూరు నియోజకవర్గ కేంద్రమైన పర్చూరులోని బిఏఆర్ అండ్ టి ఏ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళ్యాణ వేదిక నిర్మాణానికి బుధవారం భూమి పూజ జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కోడూరి శేష బ్రహ్మచారికి వివరించారు. సమస్యను గుర్తించిన శేష బ్రహ్మచారి కళావేదిక నిర్మాణానికి అంగీకరించి, బుధవారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం అధ్యక్షులు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.