
కందుకూరు: ఆటో పై పడ్డ విద్యుత్ స్తంభం
కందుకూరులోని పడమటి వడ్డెపాలెంలో బుధవారం కరెంట్ స్తంభం విరిగి రోడ్డుపై వెళ్తున్న ఆటోపై పడటంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ ఘటనతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.






































