
రాళ్లపాడు రిజర్వాయర్ పై అసెంబ్లీలో గళం విప్పిన MLA
రాళ్లపాడు రిజర్వాయర్ సమస్యలు, భద్రత అంశాలను కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు అసెంబ్లీలో ప్రస్తావించారు. రిజర్వాయర్ నీటి నిల్వలు, కట్ట భద్రత, రైతులకు సాగునీటి సరఫరాపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాళ్లపాడు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.






































