స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వ సిబ్బంది ద్వారానే జరగాలి

5చూసినవారు
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వ సిబ్బంది ద్వారానే జరగాలి
పేదలకు నిత్యావసర సరుకులైన రేషన్ సరఫరా కోసం స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేసే బాధ్యత ప్రభుత్వ సిబ్బంది ద్వారానే జరగాలని కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ సూచించారు. శనివారం ఆర్డీవో కేశవ వర్ధన్ రెడ్డికి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్మార్ట్ రేషన్ కార్డులు సచివాలయ సిబ్బంది లేదా రేషన్ డీలర్లు ద్వారా పంపిణీ చేస్తే మరింత పారదర్శకత సాధ్యమవుతుందని తెలిపారు.