లారీ ఢీకొని వృద్ధుడు మృతి

3చూసినవారు
లారీ ఢీకొని వృద్ధుడు మృతి
బుధవారం పామూరు సరిహద్దులోని 167బీ జాతీయ రహదారిపై పామూరు నుంచి సీఎస్పురం బైపాస్ వద్ద లారీ ఢీకొని మేకల నారయ్య (68) అనే వృద్ధుడు మృతి చెందాడు. కంభంపాడు గ్రామానికి చెందిన నారయ్య, మరో వ్యక్తితో కలిసి బైక్ పై స్వగ్రామానికి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న లారీ బైక్ ను ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన నారయ్యను పామూరులోని ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్