పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: తిప్పారెడ్డి

4చూసినవారు
పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: తిప్పారెడ్డి
మార్కాపురం జిల్లా కనిగిరి పొగాకు వేలం కేంద్రాన్ని రైతు సంఘం జిల్లా నాయకుడు పిల్లి తిప్పారెడ్డి సందర్శించారు. ఈ ఏడాది కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని, వ్యాపారులు 'నో బిడ్' పేరుతో రైతుల పొగాకు బేళ్లను తిరస్కరిస్తున్నారని ఆయన విమర్శించారు. జీఎస్టీ పెంపు, ఎగుమతుల తగ్గుదల కారణంగా ధరలు పడిపోయాయని, గత ఏడాది కిలోకు రూ. 360 ఉన్న ధర ఈ సారి రూ. 230కు పడిపోయిందని తెలిపారు. పొగాకు రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్