మార్కాపురం జిల్లా పామూరు పట్టణంలోని వడ్డెపాలెంలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో ఓ ఇంటిపై పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు పిడుగు పడినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, ఈ పిడుగుపాటు ధాటికి ఇల్లు పూర్తిగా దెబ్బతింది.