రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

0చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మంగళవారం అర్ధరాత్రి పీసీపల్లి మండలం మారెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పాలూరి రాధాక్రిష్ణయ్య (58) అనే వ్యక్తి మృతిచెందాడు. పెదయిర్లపాడు గ్రామానికి చెందిన రాధాక్రిష్ణయ్య, వెంగళాపురం వద్ద జరిగిన గంగ తిరునాళ్లకు వెళ్లి అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముఖానికి, తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్