రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో 'ల్యాబ్ ఆన్ వీల్స్' మొబైల్ ట్రైనింగ్ బస్సును శనివారం కనిగిరిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సుబ్బారావు నారాయణరెడ్డి, హెడ్మాస్టర్ విజయభాస్కర్ రెడ్డి బెనర్జీ పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మైక్రో కంట్రోలర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వంటివి విద్యార్థులకు అవసరమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ బస్సు ద్వారా విద్యార్థులకు అత్యాధునిక సాంకేతికతపై శిక్షణ అందించబడుతుంది.