రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి గాయాలు

2చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి గాయాలు
మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణ సమీపంలో బుధవారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మస్తాన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తికి మొదట స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్