మార్కాపురం జిల్లా పెద్ద చెర్లోపల్లి ఎస్సైగా నరసింహారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో కంభం ఎస్సైగా విధులు నిర్వహించి విఆర్ఓగా ఉన్న నరసింహారావు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో పెద్ద చెర్లోపల్లి ఎస్ఐగా నియమితులయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తానని తెలిపారు.