ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఆదివారం కాశీనాయన గుడి పరిసర ప్రాంత నివాసాలలో 12 అడుగుల కొండచిలువ కలకలం రేపింది. ఇంటి పరిసరాలలో భారీ కొండచిలువ కనిపించటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉమామహేశ్వర్ రెడ్డికి సమాచారం అందడంతో బీట్ ఆఫీసర్, స్నేక్ క్యాచర్ సంఘటనా స్థలానికి చేరుకొని కొండచిలువను పట్టుకొని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.